Pages

Thursday, February 14, 2013

జతలో జారిన కాలాలు


కనులు కనులు కలిసి చూసిన కలలు ,

గతం గమనం లో ఎన్నో మధుర స్మృతులు ;

చేయి పై చేయి వేసిన ప్రమాణాలు ,

చెక్కిలి పై చిరుముద్దు చేసిన గిలిగింతలు ;

కలహాలు, విరహాలు, మరువని ప్రణయాలు,

జతలో జారిన కాలాలు, కమ్మని గేయాలు;



నీ గుండె గూడులో వెచ్చగా  తలదాచుకున్న,

నీవు జారవిడిచినా  నిన్నే తలచుకున్న;

నీ తోడులో మనస్సు సంతోషాల సంద్రమైనది,

నీ మౌనం లో హృదయం కన్నీటి కడలైనది ;




,కలసి కదలిన నాడు మన ప్రేమ మధురం

విడిచి వెడలినా నీ పై  నా ప్రేమ అమరం 
.