Pages

Friday, May 28, 2010

నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

తెలంగాణా...
తెగిన వీణ!
నిప్పుకణికల రుద్ర వీణ !
శ్వాస శ్వాస ఉప్పెనై ,లక్షమే ఇక ప్రాణమై ,
చేయి చేయి పిడికిలై ,పౌరుషం పది ఇంతలై ,
కన్ను కన్ను ఎర్రనై ,గుండెమంటే జ్వాలయై ,
నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .
మదపుటేనుగు మంకుపట్టు ,వచ్చితీరుతా నని మిడిసిపాటు ,
యువరాజా వారికి తేలినట్టు ,దేశం ఎపుడో స్వేఛ్చ పొందినట్టు .
సింహం జూలు తో ఓదార్పు ఆట ,కాలుదువ్వితే ఇక కనువిప్పే బాట ,
పొలిమేర నుండే పొలికేక ,ఓరుగల్లున మోగింది సమరఢంకా .
రాయి,రాయి ఒక శాసనం,సమైక్య వాదం పై సమాధి మండపం,
పోరు దారిన వీర మరణం, తల్లి తెలంగాణకి రక్త తిలకం,
రుద్రమ గడ్డ మీద రౌడీ కోట,తరిమికోడుతడి ఇక తెలంగాణ ప్రతి పూట,
తెలంగాణ తెగిన వీణ! నీవు మా కోటి వజ్రాల విజయ వీణ.

Saturday, May 15, 2010

భరణం

చిన్ననాటి వాకిలి వదిలి , నీ చిటికెన వేలుపట్టి నడిచి ,
పసుపు కుంకుమ , మట్టేలను నా సౌభాగ్యం గా తలిచి ,
ఏడు సంద్రాలను దాటి ,నా ప్రపంచాన్ని విడిచి వచ్చి ,
నీ వడి నే గుడి ,నీ అండనే నా అందలం అని ఆశించి ,
రెప్పపాటున కూడా నిను విడువక సేవించి ,ప్రేమించి ..
నువు కాదని తరిమేసిన క్షణం ,
కార్చిన కన్నీటికి లేదే భరణం ;
నిలువెల్లా గాయాలైన తనువుకి ,మనసుకి ,
కాసింత ఓదార్పు నివ్వలేదే భరణం ;
కట్నాలకు కానుకలకు లేక్కకట్టే లోకం ,
కాంత కష్టానికి లేక్కకట్టలేదే యే భరణం ;
మమతకు మోసాన్ని పంచిన మృగానికి ,
ఏ చట్టం లేక్కిన్చట్లేదే నిజమైన భరణం .