Pages

Wednesday, November 10, 2010

తెలంగాణా అమాయకుని j.a.c

నేను కదిలించే కవిత రాయలేను ..
కనీసం కన్నీటి పాట తో పల్లె ని పలుకరించలేను..
నేను ఊకు డు దంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేను..
జిత్తులమారి రాజకీయవేత్తను కాను..
నేను తెలంగాణా వాదిని మేధావిని కాను...
ఒంటి కన్ను తో మొసలి కన్నీరు కార్చలేను ..
నేను
పురుగుల మందు తాగి చావబోయే రైతును..
నా వంశం ఉరితాళ్ళకు వేలాడోద్దని విలపిస్తున్న అన్నదాతను..
నేను
మగ్గం తో జీవితం ఈడ్చలేక ఓడిపోతున్న చేనేత కార్మికుడిని..
నా బిడ్డల జీవితం చీకట్లో మగ్గిపోవద్దని వేడుకుంటున్న వాడిని..
నేను
ముంబాయి ,దుబాయి ,బొగ్గుబాయి...
చట్రం లో నలిగిపోయిన బతుకుల సజీవ సాక్షాన్ని..
బొగ్గు తవ్వి తవ్వి బుగ్గిపాలైన నేను
నా కోన ఉపిరి తో కొత్త తరానికి వేలుగునివ్వాలని చూస్తున్న వెర్రివాడిని ..
నా శ్రమ మీద పాట ఒకరిది ,నా కష్టం మీద ఆట ఒకరిది ,
నా చావు మీద ఓటు ఒకరిది ,నా శవం తో ఫోటో ఫోస్ ఒకరిది ..
నన్ను అమ్ముకోకన్నా,నా మీద వ్యాపారం చేయకన్నా..
అని అరిచి చెప్పలేని అసమర్థ బడుగు జీవిని..
ఎటు బోయి..
కదిలే చరిత్రను వీక్షకునిగా చూసి వదిలేయలేని వాడిని..
ఇది వందల తరాల తెలంగాణా బిడ్డల భవిష్యత్తుకు పునాదని తెలిసిన వాడిని..
"బలవంతుడే బ్రతుకుతాడు"అని డార్విన్ థి రీ ..
"బతకడానికి బలవంతుడవ్వాలని" నా అనుభవం నాకు నేర్పిన థి రీ .
అందుకే ఖాళి కడుపుతో ,వంగిన నడుము తో..
నరాలను అదిలించి,బలాన్ని తెచ్చుకొని పిడికిలి ఎత్తాను..
అణిచివేత దెబ్బలు తిని తిని రాయినయ్యను..
ఇక రాయి..
సమైక్యవాదుల
కాలికి అడ్డం పడుతుందో,
కంట్లో నలుసవుతుందో,
నెత్తి పై బండవుతుందో..
కాలమే చెప్పాలి..
ముఖ్య గమనిక: నా వెనుక ఎవరూ లేరు..నా j.a.c కి ఏ పేరు లేదు.. అయినా మీరు ముచ్చటపడితే..నాది.. "తెలంగాణా అమాయకుని j.a.c"