మరణమంటే త్రుణప్రాయమా!నీకు త్యాగమంటే తీపి ఫలమా !
కన్న తల్లి ని కలువరించక , కాలి కాటికి కదిలేవు,
నేల తల్లిని కనుకరించక, కడుపుకోతకు వదిలేవు!
అసుర 'హస్తం ' నిన్ను తాకిన, భస్మమై మిగిలేవు,
ఎనిమిది కోటి నయనాన నువు అశ్రువై రాలేవు!
పిదికిలెత్తవా నేస్తమా! ఘీంకరిన్చవా ప్రళయమా!
తిరిగిరావా నిప్పుకణమా!నీకు మరణమంటే త్రుణప్రాయమా!
ముసలి నక్కల మూర్ఖ రాజ్యం, మూలుగు ఓ౦డ్రలు పెట్టెను,
నక్కజిత్తుల నాయకత్వం, నట్టేట మున్చెతందుకు నడుముకట్టెను!
దోవ దెలియక నీవు కోన ఉపిరే బిగబట్టినావు,
నడిరాతిరే కడరాతిరని,నమ్మి నడుమ నిష్క్రమించినవ్!
వేకువోచ్చేను నేస్తమా!ఉద్యమిన్చవా మిత్రమా!
తిరిగిరావా నిప్పుకణమా!అస్తమించిన అరుణకిరణమా!
బీడుబారిన భూమి, నీవు నీళ్ళు దెస్తవని ఎదురుజూస్తుంది ,
అంధకారాన చేనేత, నిను వెలుగు తెమ్మని పిలుస్తుంది.
గడప గడప న తల్లి నీకు ,విజయపు వీర తిలకం దిద్దింది,
పల్లెవాడలు నేడు, నువు తెలంగాణా తెస్తావని బతికుండి!
మాట తప్పకు నేస్తమా!మూగబోకు మిత్రమా!
మరణమంటే త్రుణప్రాయమా!సమిధవైతే స్వరాజ్యం సాధ్యమా?