కనులు కనులు కలిసి చూసిన కలలు ,
గతం గమనం లో ఎన్నో మధుర స్మృతులు ;
చేయి పై చేయి వేసిన ప్రమాణాలు ,
చెక్కిలి పై చిరుముద్దు చేసిన గిలిగింతలు ;
కలహాలు, విరహాలు, మరువని ప్రణయాలు,
జతలో జారిన కాలాలు, కమ్మని గేయాలు;
నీ గుండె గూడులో వెచ్చగా తలదాచుకున్న,
నీవు జారవిడిచినా నిన్నే తలచుకున్న;
నీ తోడులో మనస్సు సంతోషాల సంద్రమైనది,
నీ మౌనం లో హృదయం కన్నీటి కడలైనది ;
,కలసి కదలిన నాడు మన ప్రేమ మధురం
విడిచి వెడలినా నీ పై నా ప్రేమ అమరం
.