Pages

Wednesday, April 30, 2008

దేవుని న్యాయం... ...

కారునలుపైన కోయిలకు కమ్మని గొంతుక నిచ్చాడు,
రాలిపోయే చినుకుకు ముత్యపు రూపాన్ని ఇచ్చాడు,
కదల లేని రాయిని కళాశిల్పంగా మార్చాడు,
వాడిపోయే పుష్పానికి పూజించే భాగ్యం అందించాడు,
ప్రతి ప్రాణికి లోపాన్ని మరిపించే నిగారింపు ఇచ్చాడు,
నాకు మాత్రం నీ కమ్మని స్నేహాన్ని ప్రసాదించాడు.

3 comments:

Anonymous said...

బాగుంది. సిరివెన్నెల రాసిన "ఆది భిక్షువు" పాట గుర్తుకు వచ్చింది మీ కవిత చదివి. కొంత తేడా ఉందనుకోండి.

రాఘవ said...

కైత బాగుంది. అన్నట్టు కలువరేకులనే ఉంచెయ్యచ్చు కదా మీ బ్లాగు పేరు కూడా?

Sri said...

బాగుంది..