నీలాకాశపు చినుకు లేఖలకు పుడమి సమాధానం మౌనం,
ఝమ్మనే తుమ్మెద పిలుపుకు పుష్పం సమాధానం మౌనం,
ఎగిసి వచ్చే అలల తాకిడికి తీరం సమాధానం మౌనం ,
ఎదురుచూసే రాధ వలపుకి కృష్ణుని సమాధానం మౌనం ,
తెలుపలేని భావాలకు తీయని రూపం ఈ మౌనం,
నువు నా పై తెలుపని అంగీకారం అనుకోనా నీ మౌనం !
3 comments:
బావుంది.
చాలా చిన్న పదాలే అయినా చక్కగా రాసారు.
ఒక్కోసారి మాటలకంటే మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుందేమో. అందుకే అందుకోండి నా మౌనాభివందనం.
బాగుంది మీ కవిత.
............................................................................
...........................................................................
..........................................................................
బొల్లోజు బాబా
Post a Comment