Pages

Thursday, December 24, 2009

తెలంగాణ విప్లవిస్తుంది..

తల్లి తెలంగాణ తల్లడిల్లె ,
వెక్కెక్కి ఏడ్చి సోమ్మసిల్లె,
నేల కొరిగిన బిడ్డల జూసి ,
గుండె పగిలిపోయే.
ఎన్ని పోరాటాలు,ఎన్ని త్యాగాలు,
ఎన్నెన్ని సార్లు బిడ్డల బలిదానాలు ,
నాటి రాజకార్లనే తరిమికొట్టి
నేటి సీమంధ్ర సంకెళ్ళలో ఆర్తనాదాలు.
నమ్మజెప్తివి, నమ్మజూపితివి
పెద్దమనుషుల మాట తుంగలో తోక్తివి ,
ఇస్తామంటివి ,చేస్తామంటివి,
మా కొలువులు బాజప్తుగా కాజేస్త్తివి.
కర్నూల్ మునిగినా పర్లేదు,
నల్గొండకు మాత్రం నీల్లోదలనంటివి,
మా బతుకులు బుగ్గిపాలు జేసి,
కొత్తగూడం బొగ్గు నీకంటివి.
భద్రాద్రి రామయ్య మనవి వినవయ్య,
నాటి రావణుని మొండానికి పది తలలయ్యా ,
తెలంగాణ సీతను దోచుకెళ్ళే నేడు ,
పదమూడు రావణులుకు ఒకటే తలయ్య.
వేములవాడు రాజన్న గోడు వినవయ్యా,
తల్లి గుండె మీద కర్కశంగా కాళ్ళుబెట్టి,
విరగబడి నవ్వాడు చూడవయ్యా,
వాడు పరుగుదీస్తూ పరిహసిస్తాడు కనవయ్యా.
ఏడుకొండల సామి ,ఎంకన్న స్వామీ,
నీకు పిల్ల నిచ్చిన నేల యిది సామి,
నీ మామదా ,నిజాం దా,అని విర్రవీగుతున్నాడు,
కళ్ళల్లో కారం గొట్టి కలిసుందాం అంటుండ్రు .
యాదగిరి నరసింహ ,ఆపద్భాన్దవా ,
ప్రహ్లాదులం మేము,నిన్ను కొలిచినోల్లం,
కాకతీయుల భద్రకాళి ,మహంకాళి ,
వీరపుత్రులం మేము,కాయం కాలినా కదం తిప్పం మేము.
మా మరణాల మంట నుండి 'జై తెలంగాణ' బతికొస్తుంది,
మా రక్తం బొట్టు బొట్టు నుండి 'జై తెలంగాణ' వినిపిస్తుంది..
తరతరాల తెలంగాణ విప్లవిస్తుంది..

12 comments:

Ray Lightning said...

ఓకే :) తెలంగాణా వచ్చిందే అనుకుందాం.. ఆ తరువాత ఏమిటి స్టోరీ ? ఎవడి బతుకులు ఎక్కడ బాగుపడతాయి ? ఎవళ్ళు ఎక్కడ ఇరగదీస్తరు ?

Anonymous said...

విద్యార్థులు అనబడే పనికిమాలిన వాళ్ళు, రాజకీయనాయకులు అనబడే ఊసరవెల్లులు ఎవరైనా సరే గత నెల నుండి విధ్వంసాలు సృష్టిస్తూనే ఉన్నారు. అమాయకుల వ్యక్తిగత (ప్రైవేట్) ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను నిస్సిగ్గుగా ధ్వంసం చేస్తున్నారు. మీ వంతు అయిపోనివ్వండి. తర్వాత ప్రకృతి వంతు. ఎంతగా ప్రకృతి విరుచుకుపడుతుందో చూస్తారు గాక.

Unknown said...

తెలంగాణా స్వప్నం త్వరలోనే సాకారమవుతుంది.
జై తెలంగాణా
చక్కని కవిత రాసారు. అభినందనలు .

Anonymous said...

Telangana famous for its brilliant turn of phrase disowns this boy who cannot write few lines in praise .

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

తెలంగాణా రాష్ట్ర ఉధృత ఉద్యమ పోరాట స్పూర్తి పాటలు/గీతాలకై,.........
ఈ బ్లాగ్స్ చూడండి
www.raki9-4u.blogspot.com. . జై తెలంగాణ జైజై తెలంగాణ

Megastar said...

jai telangana

talli telanganaku vimukthi dorike
varaku aagadu Ee poratam

Megastar said...

jai telangana

talli telangananku vimukthi dorikevaraku Ee poratam aagadu

Megastar said...

Jai telangana

talli telanaganaku vimukthi dorike varaku aagadu ee poratam

Ali said...

Execellent

Ali

Dr.Deepthi said...

dayachesi telangana issue sariga telenivallu,telsukoni matladandi,lekunte telsina vallanu cheppanivvandi.
oppandam meda kalisina rashtranni darunanga adugadugu anichivesi,mosamchesi,ivala history ne marchi vesi,ma batukulu durbharam chesi,neechanga nirlajja ga matladtunna politicians ni,sini natulanu kshaminche questuion a ledu.
muudu tarala prajala bratukulu vidhavansaniki gurynavi,e bussulu,private astulu ntg before them.
kalisundadam antu jargalante 4kotla telangana prajalanu manasikanga,sharirakanga patipetti,shavala shmashanam meda rajakeyam cheskondi.
Iam not a supporter of trs r congress r tdp r bjp.iam a strong supporter of all those betrayed people,all those farmers and florosis patients,all those poor people nd all those graduates who r intentionally deprived of their rights and jobs.
anichiveta nundi ragilina jwala idi,ati chesi nalgondaku manchinellivvakunte kurnool vardalocchi poyindi.
memu asahaylum,adirinche shakti leni vallam,mosepoye vallam,kani prakruti ans istadi ane anukunte adi seemandhra ke.
nenu chadvina bhagavatgita lo dharmaniki adharmaniki yuddam jargite,dharmanni support cheyali,ante kani neutral ga vyavaharinchina tappe,adharmanni protsahinchina tappe.
jargedi kurukshetram,nenu namme krishnude shakshi,ivala anichesina inko taram pratighatistundi,memu maraninchina jai telangana bratikuntundi,idi maa swarajya poratam ......iam proud to be a part of it.vijayam apajayam viplavaniki undavu,adurutiragadame vijayam,chaitanyam,viplavam.jai telangana

సమతలం said...

మనకు జరిగన అన్యాయాలకు, అవమానాలకు ఈ ఆంధ్రా సోదరసొదరీమణుల కామెంట్లే నిదర్శనం. అన్యాయం అయిందని మనం కడుపు మండి తిడుతున్నాము. తిట్టుకుంటున్నాము. కాని ఒక్క ఆంధ్రా సొదరుడు కాని, సోదరి కాని అన్యాయం జరిగింది అని ఒప్పుకోవడం కాని, ఊరడింపు మాటకాని మాట్లాడటం లేదు. ఎందుకు కలిసుండాలో చెప్పడం లేదు, మా అస్తులు అన్ని హైద్రాబాద్ లో ఉన్నయని చెప్పడం తప్ప. అపహాస్యం, అవహేళన చేయడం మాత్రం ఆగడం లేదు. విడిపోవడమే శరణ్యం.

తెలుగు వెబ్ మీడియా said...

మూడు కోట్ల వజ్రాల వీణ తెలంగాణా