నలువైపుల తామసి జడలు విప్పి ప్రళయ గీతం పాడుతుంటే ,
ఆశావిహీనమై మది దైన్యమై, మౌనరాగాన విలపిస్తుంటే,
తోడు లేని హృదయం తనను తాను ఊరడించినా,
గతం చేసిన గాయం ఒక జన్మైనా మానునా ,
మరువడానికి మనస్సుకి మంత్రమేది కానరాదు
బ్రతకడానికి గుండెకి ధైర్యమేది మిగులలేదు
ఒక చెలిమి జత విడిచి చితిమంటల పై తోసింది,
ఒక బంధం తప్పటడుగుల విమర్శించే వేలైంది,
కరిగే కొవ్వత్తి వెలుగిచ్చినా, వేకువ లేనిది .
గెలుపోటములు నావైనా , వాటి వినోదం లోకానిది.
చింత నందు దరి చేర్చుకునే గుణం మనిషికి లేదు
బాధ నుండి ముక్తి నిచ్చే దైవం ఉనికి లేదు.