నలువైపుల తామసి జడలు విప్పి ప్రళయ గీతం పాడుతుంటే ,
ఆశావిహీనమై మది దైన్యమై, మౌనరాగాన విలపిస్తుంటే,
తోడు లేని హృదయం తనను తాను ఊరడించినా,
గతం చేసిన గాయం ఒక జన్మైనా మానునా ,
మరువడానికి మనస్సుకి మంత్రమేది కానరాదు
బ్రతకడానికి గుండెకి ధైర్యమేది మిగులలేదు
ఒక చెలిమి జత విడిచి చితిమంటల పై తోసింది,
ఒక బంధం తప్పటడుగుల విమర్శించే వేలైంది,
కరిగే కొవ్వత్తి వెలుగిచ్చినా, వేకువ లేనిది .
గెలుపోటములు నావైనా , వాటి వినోదం లోకానిది.
చింత నందు దరి చేర్చుకునే గుణం మనిషికి లేదు
బాధ నుండి ముక్తి నిచ్చే దైవం ఉనికి లేదు.
4 comments:
chaalaa bagaa vrasaaru.
andunaa vishaadam.:(
చాలా విషాదం కవిత నిండా పరచుకుంది.బాగా వ్రాసారు.బాధించే జ్ఞాపకాలు మరవటం ఎలా ?అని నా బ్లాగులో వ్రాసాను గమనించగలరు.
దీప్తి గారు విషాద గీతాన్ని చాల బాగా వ్రాశారు.మీ కవితలు ప్రశాంతమైన హృదయంలో చిన్న అలజడిని సృష్టిస్తున్నాయి ఎప్పుడో మరచిపోయిన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకుతేస్తున్నాయి.అందులో నలువైపుల తామసి జడలు విప్పి ప్రళయ గీతం పాడుతుంటే అనే వాక్యం చాల బాగా వ్రాశారు బాగుంది.
దీప్తి గారు
విషాద గీతాన్ని చాల బాగా వ్రాశారు.మీ కవితలు ప్రశాంతమైన హృదయంలో చిన్న అలజడిని సృష్టిస్తున్నాయి ఎప్పుడో మరచిపోయిన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకుతేస్తున్నాయి.అందులో నలువైపుల తామసి జడలు విప్పి ప్రళయ గీతం పాడుతుంటే అనే వాక్యం చాల బాగా వ్రాశారు బాగుంది.
Post a Comment