Pages

Friday, August 1, 2008

రామసేతు ....

భారత జాతి సీతయై , బంగరు జింక ఓడరేవై ,

మారీచుని మాయ నాదం సర్కారు అఫిడ్విటై ,

రామసేతే లక్ష్మనరేఖయై ,దేశ సంస్కృతికి రక్షణ రేఖయై ,

లంకేషుని కపట భిక్షాటన ఈ కాసుల ఒప్పందమై,

కూల్చే రాయి కదిలే భారతావని నైతిక విలువలై,

చెరిపే వంతెన తో మన అస్తిత్వమే నిర్వీర్యమై,

ఇది మరో సీతాపహరణం అయి ,

అడ్డుతగిలే జటాయువు కొరవైనది ,

వంద కోట్ల నరులలో,

రామునికో వానరం కరువైనది!

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది

చైతన్య.ఎస్ said...

చాలా బాగుంది. మీ ఆవేదన అర్థం అయ్యింది. రాముని ఉనికినే ప్రశ్నిస్తూన్న దూర్త రావ((కరు))ణు ఎక్కువ అయ్యారు. నిరసనలు తప్ప ఏమి చెయ్యలేక పొతున్నాం