గమ్మత్తుగా గగనం మెరుపులతో ధరణి చిత్రాలు తీస్తుంటే ,
చలచల్లని చినుకులు చిగురుటాకుల చెక్కిళ్ళు చేరుతుంటే ,
పిచ్చుకలు వేగిరముతో వెచ్చటి గూళ్ళకు వెళుతుంటే,
తడిచిన తడి అందం తో ప్రకృతి తరుణీ లా హాసిస్తుంటే,
చల్లటి గాలులు చిన్ననాటి చిలిపితనాలను నిదురలేపుతుంటే ,
తామసి లో చేరిన సంధ్య వెచ్చటి ఊసులను యదలో నింపుతుంటే ,
ఉరుము ధాటికి జడిసిన ప్రియురాలి అందం పరవశింపజేస్తుంటే,
ఉండిపోవా వానా మోడుబోయిన మది లో నీ కావ్యం ఉద్భవిస్తుంటే...!
2 comments:
nice one deepthi....
bagundi.......
first line baga nachindi.......
చాలా బావుంది. ఇంకొంచం విరివిగా ప్రయత్నించండి ఇంకా బాగా రాయగలరు
Post a Comment