Pages

Wednesday, June 23, 2010

నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?

(స్వతంత్ర భారతం సాధించిన ఘనత..)
ఆడకూతురు మీద అత్యాచారం,ఆసిడ్ దాడి..
అండెర్సన్ కేమో అతిధి లాంచనాలతో పరారి..
పల్లె వెన్నెముకకు ఉరితాళ్ళ దారి..
పి ల్ కేమో వేలకోట్ల రహదారి..
అయినా ప్రశించలేని ఓ భారత పౌరుడా !
నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?
వోట్ వేసే ప్రజలకు మురికి నాలి..
ప్రజప్రతినిదులది అవినీతి స్వారి..
బతుకుదెరువు కోసం దుబాయ్ దారి..
ఖజానా నేమో సుమారు ఖాళి..
అయినా ప్రశించలేని భారత పౌరుడా !
నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?
చదువుకున్న వాడు చప్రాసి,
వీధి గూండా నేమో మిస్టర్ మంత్రి,
గనులేమో ఘనులకు..
ఉప్పు పప్పు పై భారం మనకు..
అయినా ప్రశించలేని భారత పౌరుడా !
నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?

6 comments:

Sandeep P said...

ఉన్న మాట చెప్పారు అండి. మీ బ్లాగులో చిత్రం చూస్తే నాకు దుఃఖం కలుగుతోంది. చదువుకున్నవాళ్ళ వలన ముందుకు పోవలసిన భారతదేశం వారివల్లనే వెనకబడుతోంది. మంచి రాజకీయనాయకులను ప్రోత్సహించడం మానేసి కులాలకోసం, మతాలకోసం వోటేస్తున్న చదువుకున్న వారి చదువు దేనికి? మరీ చదువు ఎక్కువయిపోతే అమెరికాకో, ఇంగ్లండుకో పోయి భారతదేశంలోని దారిద్ర్యం గురించి కాఫీలు త్రాగుతూ విమర్శించడం ఫ్యాషణయిపోయింది. మన తరమైనా కాస్త పురోగతిని సాధించాలి.

Dileep.M said...

బతుకేమో మరి దండగే


అండెర్సన్ కేమో స్వాగతలాంచనాలతో పరారి..

స్వాగత అని కాకుండా వీడ్కోలు అనో మరోటో మరోటో వుండాలనుకుంటా

Anonymous said...

excellent...

Mahesh said...

Hey deepthi it was great poem and..

heart touching......

keep on writing.....

all the best....

Naagarikuda Vinu said...

anderson kemo atithi lanchanalato anavachchemo?

Dr.Deepthi said...

nice suggestion i changed the word to athidhi