Pages

Friday, September 17, 2010

తెలుపవే త్రివర్ణమా.!తెలంగాణా చరితను..

తెలుపవే త్రివర్ణమా !తెలంగాణా ధీర చరితను!
నిప్పుకణికల గన్న బంగరు భూమి కథను!
తరతరాల బూజు మా నైజాము రాజు,
కంఠకుఢై పీడించే ప్రజలను ప్రతిరోజు,
ఆదిలాబాదున బుట్టె మా గోండుల మారాజు,
తుపాకిలెత్తి నైజాము బంటులను తరిమికొట్టే రోజు.
చెప్పవే పతాకమా ! కొమరం భీం కథను,
అడివి తల్లి కి పుట్టిన పులిబిడ్డ చరితను!
"నా తెలంగాణా కోటి రతణాల వీణ
తీగలు దెంచి నిప్పున దోసారన్న " దాశరధి మాట,
చుట్టుముట్టు సూర్యాపేట,నట్టనడుమ నల్లగొండ,
గోల్కొండ కోట కింద నీకు గోరి కడతామన్న"యాదగిరి పాట!
చెప్పవే పతాకమా !మా కవుల కథలను,
సరదాగా చెప్పవే మా రంగడి కుచ్చుటోపి ఉద్యమ చరితను!
వందేమాతరం' అన్న ఉస్మానియా విద్యార్ధి లోకం,
కోఠి ప్రెసిదెన్సి పై తుర్బెజ్ఖాన్ పోరాటం,
గడీలను కూల్చిన దొడ్డి కొమరయ్య వీర మరణం,
పిడికిలెత్తిన చాకలి ఐలమ్మ వీర కథనం.
చెప్పవే పతాకమా! తరం ఉద్యమ కిశోరాలకు,
నిన్ను ఎగురవేయ ప్రాణాలర్పించిన పరకాల చరితను.
మా తాతలు ప్రాణాలిచ్చి నిను సాధించారు,
మా నాన్నలు నీ నీడన తుపాకిలకు బలయ్యారు,
మా తమ్ముళ్ళు నీ సాక్షి గా రక్తపు ఏళ్ళను పారించారు,
మా చెల్లెళ్ళు నువు చూస్తుండగా అవమానాల పాలయ్యారు.
ఎగురవే పతాకమా !వీర తెలంగాణా వారసత్వమా!
వలస పాలకుల గుండె గుండె పై గర్జించే విముక్తి అస్త్రమా!!
!!

4 comments:

Anonymous said...

జై తెలంగాణ

Konatham Dileep said...

చాలా సందర్భోచితంగా ఉంది మీ పాట

Konatham Dileep
hridayam.wordpress.com

gsreddy said...

chaduvutunte netturu udukutondi...............jai telangana

David said...

superb