Pages

Saturday, September 18, 2010

సగటు స్త్రీ ఆవేదన..

పుట్టిన వెంటనే లక్ష్మి దేవంటారు,
పుట్టకముందే గొంతు నలిపేస్తున్నారు.
చదువున ఎదిగితే సరస్వతులం అంటారు,
కాలేజి కెళ్తే ఆసిడ్లు పోస్తారు.
ఉద్యమాన మమ్ము స్త్రీ శక్తి అంటారు,
ఉద్యమిస్తే ఖాకి కీచకుడు వస్తాడు.
సృష్టికి మేము జననులం అంటారు,
వీధుల్లో మాత్రం అంగడి సరకుగా చూస్తున్నారు .
స్త్రీలను గౌరవించే రామ రాజ్యం కాదు,
సి సి కెమెరాలతో వేధించే ఆటవిక రాజ్యం.
ఆపదన ఆదుకునే ద్వాపర యుగం కాదు,
శిక్షలు తప్పించే రాజకీయ యుగం.
మీరే చెప్పండి
కాంత కన్నీరు పెట్టాలా?క్రోధించాలా?
మీరే తేల్చండి
నైతికంగా దేశం ఎదుగుతుందా?దిగాజారుతుందా?
అన్యాయానికి,అవమానానికి,గురికాని సగటు స్త్రీ ఇవాళ లేదు,
పడతి పాశావికానికి అసహాయంగా అంతరించక తప్పట్లేదు.
కదలండి,ప్రశ్నించండి,సమాజాన్ని సంస్కరించండి,
జనని కే కోపమొస్తే సృష్టే ఆగిపోవల్సోస్తుంది.

2 comments:

శ్రీధర్ said...

మీ ఆవెదన విన్నాక గుండె బరువెక్కి పోయింది. మీ బ్లాగు మొదటి సారి చదివాను. చాలా బాగుంది. నా బ్లాగు కూడా చూడండి. ( క్షీర గంగ )

David said...

very nice...