పదహారేళ్ళ వయస్సులో పద్దెనిమిది గంటలు కష్టించి సాధించిన చదువు,
పీనుగు తాకి హడలకుండా నిత్యం అధ్యయించిన అమూల్యమైన చదువు,
కాళ్ళు నోస్తున్నా,కళ్లు తిరుగుతున్నా,కదలక నిలబడి నేర్చిన చదువు,
కాలిన తనువు,రక్తపు మడుగు చూసినా,చలించక చిత్తశుద్ధితో నేర్చిన చదువు,
రేయనక, పగలనక ప్రతి నిమిషం అంకితమిచ్చి పొందిన చదువు,
నిందలు,పగిలిన అద్దాలు హేళనగా వెక్కిరించినా, వ్యధ చెందక వృద్ధి చెందిన చదువు,
చిట్టిపపాయికి జన్మనిచ్చి,ఆగిన గుండెకు ఆసరాగా నిలిచి,
సేవ తో సార్ధకత పొందిన నా చదువు,
అలిసిపోక,ఆగిపోక,అనుక్షణం మరో ప్రాణం కోసం ఆరాటపడి,
మానవత్వపు శిఖరాన్ని అవరోహించిన నా చదువు,
......................................................నా గెలుపు.
2 comments:
శ్వేత...
ఈ మధ్య బ్లాక్టర్లు ఎక్కువైపోయారన్న మాట:-) మీ కవిత బాగుంది. చివరి వాక్యం మరీ నచ్చింది.
వైద్యుల గురించి భలే చెప్పారు.
Post a Comment