జానకి కంత జాలి యేల?
జూదం లో తననోడిన ధర్మరాజు ఫై,
ద్రౌపది కంత దయయేల ?
తనను మరచి వెళ్ళిన దుష్యంతుని ఫై,
శకుంతల కంత సహనమేల?
తన దరికి తిరిగి రాని గోపాలుని ఫై,
రాధ కంత అనురాగమేల?
మాధవుని మనసైనదైనా,
హరిశ్చంద్రుని ధర్మపత్నియైనా ,
కాంతకు కన్నీరు తప్పలేదే?
తన సహనమే తనకు శిక్షా?
లోకహితం లోకపావనికి పరీక్షా?
లోకం లో మూడు వంతుల నీరు,
స్త్రీల నయనాలు చెమర్చిన కన్నీరు,
ఇంకా అతివను ఏడిపిస్తే మీరు ,
ధరణి దుఃఖ కడలి లోకి చేజారు. . !
7 comments:
మీ కామెంట్స్ కు థాంక్స్
మీ కవిత బాగుంది.
ధరణి దు:ఖ కడలిలోకి చేజారు అనా మీ అభిప్రాయయం?
ఒక సారి చూడండి.
బొల్లోజు బాబా
శ్వేత గారు : అధ్భుతంగా ఉన్నాయి మీ కవితలు. చక్కనైన పదాలు, మనసుకి హత్తుకునే భావాలు. హృదయాంతరాళాలలో కదలాడే ఆలోచనలకు, ఆశలకు, ఊహలకు, ఊసులకు, బాసలకు సజీవ అక్షరరూపం అనిపిస్తున్న మీ కవితలకు వేనవేల అభినందనలు.
ఇప్పటికి మీరు చదవకుంటే వీలైతే రాధిక గారి 'స్నేహమా', నిషిగంధ గారి ' మానసవీణ', హృదయబృందావని గారి 'ఒక హృదయం' మరియు దీపు గారి 'ఏకాంతవేళ... ఉప్పొంగే భావాల' బ్లాగ్స్ ఒకసారి చదవండి.
ప్రేరణ ఏదైనా, ఎవరైనా ఎవరి భావవ్యక్తీకరణ వారిది.
సమయముంటే మీ అభిప్రాయాలు వారితే పంచుకోవటానికి ప్రయత్నించండి.
దయచేసి Word Verification తీసివేయటానికి ప్రయత్నించరూ ...
endukantea aa rojullo barya bartha
antea vearu vearu kaadu okatea anukunea vaaru papam.
appatikinkaa "adams" "eve" gurinchi teliyadu "ardhanaariswarula" gurinchea telusu
THis is an interesting take .. and well expressed.
Keep writing.
మీ కవితలు సరళసుందరంగా ఉన్నాయి. ముఖ్యంగా భావము బాగుంది.
శుభాకాంక్షలు..
really good one.
లోకం లో మూడు వంతుల నీరు,
స్త్రీల నయనాలు చెమర్చిన కన్నీరు,
ఇంకా అతివను ఏడిపిస్తే మీరు ,
ధరణి దుఃఖ కడలి లోకి చేజారు. . !
అద్భుతమైన వ్యక్తీకరణ!
Post a Comment