Pages

Monday, December 27, 2010

రగులుతున్న తెలంగాణా..

రగులుతున్న తెలంగాణా రణ స్థలమై నిలువనుంది,
మరుగుతున్న అగ్ని జ్వాల అఖండమై ఎగియనుంది,
పారాహుషార్ ప్రభువులారా ! ప్రళయం రానుంది,
రాజకీయ చదరంగానికి చరమ గీతం పాడనుండి.
చిట్టిచీమలు జట్టుగట్టి పాముల పనిబట్టినట్టు,
వానర సైన్యం పట్టుబట్టి లంకను జయించినట్టు,
'ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ ' ఆంగ్లేయులను తరిమినట్టు,
సర్ఫరోషి కి తమన్నా "అని భగత్ సింగ్ కదిలినట్టు,
తండ తండా కదలనుంది,టూటాకో తల పెట్టనుంది,
వీధి వాడా సహాయనిరాకరణ తో పోరాటాన్ని ఎక్కుపెట్టనుంది,
ఉరి శిక్షలకు భయపడని పులి బిడ్డల పురటి గడ్డ,
బానిస సంకెళ్ళను దెంచ కదిలె తెలంగాణా పోరుగడ్డ.
కవి నాల్కేన శారదుంటే ,రాబోయే తెలంగాణ
ఉద్యమ కొలిమిన పండిన మేలిమి సువర్ణం.
ఇక అడ్డుకుంటే అభాసుపాలు,కాదంటే కదనమే నేడు,
ప్రజాస్వామిక పోరాట ప్రభంజనం లో పతనమే వీరు..
జై తెలంగాణ..!

Wednesday, November 10, 2010

తెలంగాణా అమాయకుని j.a.c

నేను కదిలించే కవిత రాయలేను ..
కనీసం కన్నీటి పాట తో పల్లె ని పలుకరించలేను..
నేను ఊకు డు దంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేను..
జిత్తులమారి రాజకీయవేత్తను కాను..
నేను తెలంగాణా వాదిని మేధావిని కాను...
ఒంటి కన్ను తో మొసలి కన్నీరు కార్చలేను ..
నేను
పురుగుల మందు తాగి చావబోయే రైతును..
నా వంశం ఉరితాళ్ళకు వేలాడోద్దని విలపిస్తున్న అన్నదాతను..
నేను
మగ్గం తో జీవితం ఈడ్చలేక ఓడిపోతున్న చేనేత కార్మికుడిని..
నా బిడ్డల జీవితం చీకట్లో మగ్గిపోవద్దని వేడుకుంటున్న వాడిని..
నేను
ముంబాయి ,దుబాయి ,బొగ్గుబాయి...
చట్రం లో నలిగిపోయిన బతుకుల సజీవ సాక్షాన్ని..
బొగ్గు తవ్వి తవ్వి బుగ్గిపాలైన నేను
నా కోన ఉపిరి తో కొత్త తరానికి వేలుగునివ్వాలని చూస్తున్న వెర్రివాడిని ..
నా శ్రమ మీద పాట ఒకరిది ,నా కష్టం మీద ఆట ఒకరిది ,
నా చావు మీద ఓటు ఒకరిది ,నా శవం తో ఫోటో ఫోస్ ఒకరిది ..
నన్ను అమ్ముకోకన్నా,నా మీద వ్యాపారం చేయకన్నా..
అని అరిచి చెప్పలేని అసమర్థ బడుగు జీవిని..
ఎటు బోయి..
కదిలే చరిత్రను వీక్షకునిగా చూసి వదిలేయలేని వాడిని..
ఇది వందల తరాల తెలంగాణా బిడ్డల భవిష్యత్తుకు పునాదని తెలిసిన వాడిని..
"బలవంతుడే బ్రతుకుతాడు"అని డార్విన్ థి రీ ..
"బతకడానికి బలవంతుడవ్వాలని" నా అనుభవం నాకు నేర్పిన థి రీ .
అందుకే ఖాళి కడుపుతో ,వంగిన నడుము తో..
నరాలను అదిలించి,బలాన్ని తెచ్చుకొని పిడికిలి ఎత్తాను..
అణిచివేత దెబ్బలు తిని తిని రాయినయ్యను..
ఇక రాయి..
సమైక్యవాదుల
కాలికి అడ్డం పడుతుందో,
కంట్లో నలుసవుతుందో,
నెత్తి పై బండవుతుందో..
కాలమే చెప్పాలి..
ముఖ్య గమనిక: నా వెనుక ఎవరూ లేరు..నా j.a.c కి ఏ పేరు లేదు.. అయినా మీరు ముచ్చటపడితే..నాది.. "తెలంగాణా అమాయకుని j.a.c"

Friday, October 1, 2010

బతుకమ్మ..

కట్ల పూవులు మా కోమటి అక్కలు,
గోరింట పూవులు మా గొళ్ళ భామలు ,
చేమంతి పూవులు మా వడ్రంగి చెల్లెళ్ళు,
బంతి పూవులు మా బడుగు పిల్లలు.
తంగేడి పూవులు మా తెలగ కూనలు,
గునుగు పూలు మా దుదేకులపోల్లు ,
సన్నజాజులు మా సాకలి వదినలు ,
గుమ్మెడి పూవులు మా ఔసాలి పిన్నులు .
పువ్వు పువ్వు కో వర్ణం ,ప్రతి వర్ణం సువర్ణం;
కలగలిసి వెలిసిన బతుకమ్మ, తెలంగాణ కొంగు బంగారం.

Saturday, September 18, 2010

సగటు స్త్రీ ఆవేదన..

పుట్టిన వెంటనే లక్ష్మి దేవంటారు,
పుట్టకముందే గొంతు నలిపేస్తున్నారు.
చదువున ఎదిగితే సరస్వతులం అంటారు,
కాలేజి కెళ్తే ఆసిడ్లు పోస్తారు.
ఉద్యమాన మమ్ము స్త్రీ శక్తి అంటారు,
ఉద్యమిస్తే ఖాకి కీచకుడు వస్తాడు.
సృష్టికి మేము జననులం అంటారు,
వీధుల్లో మాత్రం అంగడి సరకుగా చూస్తున్నారు .
స్త్రీలను గౌరవించే రామ రాజ్యం కాదు,
సి సి కెమెరాలతో వేధించే ఆటవిక రాజ్యం.
ఆపదన ఆదుకునే ద్వాపర యుగం కాదు,
శిక్షలు తప్పించే రాజకీయ యుగం.
మీరే చెప్పండి
కాంత కన్నీరు పెట్టాలా?క్రోధించాలా?
మీరే తేల్చండి
నైతికంగా దేశం ఎదుగుతుందా?దిగాజారుతుందా?
అన్యాయానికి,అవమానానికి,గురికాని సగటు స్త్రీ ఇవాళ లేదు,
పడతి పాశావికానికి అసహాయంగా అంతరించక తప్పట్లేదు.
కదలండి,ప్రశ్నించండి,సమాజాన్ని సంస్కరించండి,
జనని కే కోపమొస్తే సృష్టే ఆగిపోవల్సోస్తుంది.

Friday, September 17, 2010

తెలుపవే త్రివర్ణమా.!తెలంగాణా చరితను..

తెలుపవే త్రివర్ణమా !తెలంగాణా ధీర చరితను!
నిప్పుకణికల గన్న బంగరు భూమి కథను!
తరతరాల బూజు మా నైజాము రాజు,
కంఠకుఢై పీడించే ప్రజలను ప్రతిరోజు,
ఆదిలాబాదున బుట్టె మా గోండుల మారాజు,
తుపాకిలెత్తి నైజాము బంటులను తరిమికొట్టే రోజు.
చెప్పవే పతాకమా ! కొమరం భీం కథను,
అడివి తల్లి కి పుట్టిన పులిబిడ్డ చరితను!
"నా తెలంగాణా కోటి రతణాల వీణ
తీగలు దెంచి నిప్పున దోసారన్న " దాశరధి మాట,
చుట్టుముట్టు సూర్యాపేట,నట్టనడుమ నల్లగొండ,
గోల్కొండ కోట కింద నీకు గోరి కడతామన్న"యాదగిరి పాట!
చెప్పవే పతాకమా !మా కవుల కథలను,
సరదాగా చెప్పవే మా రంగడి కుచ్చుటోపి ఉద్యమ చరితను!
వందేమాతరం' అన్న ఉస్మానియా విద్యార్ధి లోకం,
కోఠి ప్రెసిదెన్సి పై తుర్బెజ్ఖాన్ పోరాటం,
గడీలను కూల్చిన దొడ్డి కొమరయ్య వీర మరణం,
పిడికిలెత్తిన చాకలి ఐలమ్మ వీర కథనం.
చెప్పవే పతాకమా! తరం ఉద్యమ కిశోరాలకు,
నిన్ను ఎగురవేయ ప్రాణాలర్పించిన పరకాల చరితను.
మా తాతలు ప్రాణాలిచ్చి నిను సాధించారు,
మా నాన్నలు నీ నీడన తుపాకిలకు బలయ్యారు,
మా తమ్ముళ్ళు నీ సాక్షి గా రక్తపు ఏళ్ళను పారించారు,
మా చెల్లెళ్ళు నువు చూస్తుండగా అవమానాల పాలయ్యారు.
ఎగురవే పతాకమా !వీర తెలంగాణా వారసత్వమా!
వలస పాలకుల గుండె గుండె పై గర్జించే విముక్తి అస్త్రమా!!
!!

Wednesday, June 23, 2010

నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?

(స్వతంత్ర భారతం సాధించిన ఘనత..)
ఆడకూతురు మీద అత్యాచారం,ఆసిడ్ దాడి..
అండెర్సన్ కేమో అతిధి లాంచనాలతో పరారి..
పల్లె వెన్నెముకకు ఉరితాళ్ళ దారి..
పి ల్ కేమో వేలకోట్ల రహదారి..
అయినా ప్రశించలేని ఓ భారత పౌరుడా !
నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?
వోట్ వేసే ప్రజలకు మురికి నాలి..
ప్రజప్రతినిదులది అవినీతి స్వారి..
బతుకుదెరువు కోసం దుబాయ్ దారి..
ఖజానా నేమో సుమారు ఖాళి..
అయినా ప్రశించలేని భారత పౌరుడా !
నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?
చదువుకున్న వాడు చప్రాసి,
వీధి గూండా నేమో మిస్టర్ మంత్రి,
గనులేమో ఘనులకు..
ఉప్పు పప్పు పై భారం మనకు..
అయినా ప్రశించలేని భారత పౌరుడా !
నోరున్నా గొంతెత్తలేని మనిషి బతుకెందుకు?

Friday, May 28, 2010

నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

తెలంగాణా...
తెగిన వీణ!
నిప్పుకణికల రుద్ర వీణ !
శ్వాస శ్వాస ఉప్పెనై ,లక్షమే ఇక ప్రాణమై ,
చేయి చేయి పిడికిలై ,పౌరుషం పది ఇంతలై ,
కన్ను కన్ను ఎర్రనై ,గుండెమంటే జ్వాలయై ,
నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .
మదపుటేనుగు మంకుపట్టు ,వచ్చితీరుతా నని మిడిసిపాటు ,
యువరాజా వారికి తేలినట్టు ,దేశం ఎపుడో స్వేఛ్చ పొందినట్టు .
సింహం జూలు తో ఓదార్పు ఆట ,కాలుదువ్వితే ఇక కనువిప్పే బాట ,
పొలిమేర నుండే పొలికేక ,ఓరుగల్లున మోగింది సమరఢంకా .
రాయి,రాయి ఒక శాసనం,సమైక్య వాదం పై సమాధి మండపం,
పోరు దారిన వీర మరణం, తల్లి తెలంగాణకి రక్త తిలకం,
రుద్రమ గడ్డ మీద రౌడీ కోట,తరిమికోడుతడి ఇక తెలంగాణ ప్రతి పూట,
తెలంగాణ తెగిన వీణ! నీవు మా కోటి వజ్రాల విజయ వీణ.

Saturday, May 15, 2010

భరణం

చిన్ననాటి వాకిలి వదిలి , నీ చిటికెన వేలుపట్టి నడిచి ,
పసుపు కుంకుమ , మట్టేలను నా సౌభాగ్యం గా తలిచి ,
ఏడు సంద్రాలను దాటి ,నా ప్రపంచాన్ని విడిచి వచ్చి ,
నీ వడి నే గుడి ,నీ అండనే నా అందలం అని ఆశించి ,
రెప్పపాటున కూడా నిను విడువక సేవించి ,ప్రేమించి ..
నువు కాదని తరిమేసిన క్షణం ,
కార్చిన కన్నీటికి లేదే భరణం ;
నిలువెల్లా గాయాలైన తనువుకి ,మనసుకి ,
కాసింత ఓదార్పు నివ్వలేదే భరణం ;
కట్నాలకు కానుకలకు లేక్కకట్టే లోకం ,
కాంత కష్టానికి లేక్కకట్టలేదే యే భరణం ;
మమతకు మోసాన్ని పంచిన మృగానికి ,
ఏ చట్టం లేక్కిన్చట్లేదే నిజమైన భరణం .

Sunday, February 21, 2010

సమిధవైతే స్వరాజ్యం సాధ్యమా?..

తిరిగి రావా నిప్పుకణమా ! అస్తమించిన అరుణకిరణమా!
మరణమంటే త్రుణప్రాయమా!నీకు త్యాగమంటే తీపి ఫలమా !
కన్న తల్లి ని కలువరించక , కాలి కాటికి కదిలేవు,
నేల తల్లిని కనుకరించక, కడుపుకోతకు వదిలేవు!
అసుర 'హస్తం ' నిన్ను తాకిన, భస్మమై మిగిలేవు,
ఎనిమిది కోటి నయనాన నువు అశ్రువై రాలేవు!
పిదికిలెత్తవా నేస్తమా! ఘీంకరిన్చవా ప్రళయమా!
తిరిగిరావా నిప్పుకణమా!నీకు మరణమంటే త్రుణప్రాయమా!
ముసలి నక్కల మూర్ఖ రాజ్యం, మూలుగు ఓ౦డ్రలు పెట్టెను,
నక్కజిత్తుల నాయకత్వం, నట్టేట మున్చెతందుకు నడుముకట్టెను!
దోవ దెలియక నీవు కోన ఉపిరే బిగబట్టినావు,
నడిరాతిరే కడరాతిరని,నమ్మి నడుమ నిష్క్రమించినవ్!
వేకువోచ్చేను నేస్తమా!ఉద్యమిన్చవా మిత్రమా!
తిరిగిరావా నిప్పుకణమా!అస్తమించిన అరుణకిరణమా!
బీడుబారిన భూమి, నీవు నీళ్ళు దెస్తవని ఎదురుజూస్తుంది ,
అంధకారాన చేనేత, నిను వెలుగు తెమ్మని పిలుస్తుంది.
గడప గడప న తల్లి నీకు ,విజయపు వీర తిలకం దిద్దింది,
పల్లెవాడలు నేడు, నువు తెలంగాణా తెస్తావని బతికుండి!
మాట తప్పకు నేస్తమా!మూగబోకు మిత్రమా!
మరణమంటే త్రుణప్రాయమా!సమిధవైతే స్వరాజ్యం సాధ్యమా?

Friday, January 1, 2010

మోగింది మోగింది సమరశంఖం మోగింది,
తెలంగాణా గుండె గుండె జై అంటు మోగింది.
కదిలింది కదిలింది జనస్రవంతి కదిలింది,
సంకేల్లనే తెంచి అది రుద్రకాళి లా కదిలింది.
సింగరేణి గనుల నుండి యుద్ధభేరి మోగింది,
సిరిసిల్ల చేనేత నుంచి చైతన్యం పొంగింది.
పత్తి రైతుల నుండి,శ్రమజీవుల నుండి,
అంతంత,అంతంత,అనంతమై సమరం సాగింది.
ఓరుగల్లు జిల్లా పోరుగల్లై దూకింది,
కరీంనగర్ నేల కదనానికి కాలు దువ్వింది,
గల్లి గల్లి నుండి లొల్లి శురువయ్యింది ,
డిల్లి మెడలు వంచ విద్యార్థి లోకం పూనుకుంది.
బోనాలు బతుకమ్మలతో తెలంగాణా జాతర సాగింది,
రాజి లేని బతుకు పోరుకి రణరంగం లో దూకింది.
కడుపు మంట నుండి,గుండె కోత నుండి,
జై తెలంగాణా నినాదం గగనానికి ఎగిసింది,
అమరవీరుల నుండి,సమర యోధుల నుండి,
త్యాగాల తెలంగాణా జెండా సత్వరలో రెపరెప లాడనుంది .