Pages

Thursday, May 1, 2008

జో జో ....

లేత బుగ్గపై చిట్టి ముద్దులా,
చిట్టి పాపాయికి వెచ్చటి ఒడిలా,
కంటి పాప లో కమ్మటి కలలా,
ఒదిగిపోవా కునుకా ఈ రేయిన,
నా ప్రియమైన నేస్తం విశ్రమించే ఈ వేళనా ........

3 comments:

భావకుడన్ said...

చాలా బావుంది కవిత. ముఖ్యంగా "నా ప్రియమయిన నేస్తం విశ్రమించే వేళనా " అన్నది చాలా బావుంది. కవితో భావం, లయ, నడక, చెప్పాలనుకున్న దాంట్లో స్పష్టత బావున్నాయి.

ఇంకా లయ బద్దంగా ఉండాలంటే మీ పదాలను లయానుగుణంగా సరిచేసుకుంటే బావుంటుంది
అంటే ఫర్ ex
"నా ప్రియమైన నేస్తం విశ్రమించే ఈ వేళనా" అన్నారు కదా దాన్నే
"నా ప్రియ నేస్తం విశ్రమించు ఈ వేళ....." అని ఉంటే పైన ఉన్న మూడు పంక్తులలోని no of లెటర్స్ తో ఈ పంక్తి కూడా సరిగ్గా సరి పోయేది. చిన్న సజెషన్ మాత్రమే ఇది, అడిగారు కాబట్టి.

రాఘవ said...

ఒడి అని ఉండాలి. వడి అంటే వేగం. గమనించగలరు.

Bolloju Baba said...

మీ బ్లాగు బాగుంది.
మీ కవితలో సున్నితమైన భావాలున్నాయి. పైన చెప్పిన కామెంట్లతో ఏకీభవిస్తున్నాను.

బొల్లోజు బాబా
వీలైతే నాబ్లాగును దర్శించండి.
http://sahitheeyanam.blogspot.com/